'లక్ష్య' పోస్టర్: లవర్ బాయ్ లుక్ లో నాగశౌర్య

'లక్ష్య' పోస్టర్: లవర్ బాయ్ లుక్ లో నాగశౌర్య

నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్రలో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా ఆర్చరీ నేపథ్యంలో తెరెకెక్కుతుంది ఈ సినిమా. అందుకోసం తన శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకున్నాడు. సూపర్ ఫిట్ బాడీతో, సిక్స్ ప్యాక్‌తో ఉన్న నాగశౌర్య ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా యూనిట్ మరో పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో నాగశౌర్య క్లీన్ సేవ్‌తో లవర్ బాయ్ లుక్ లో కనిపించాడు. కాగా ఈ సినిమా కూడా సమ్మర్ లోనే రానుండడంతో మిగితా సినిమాలతో పోటీపడనుంది.