ఆ నలుగురే స్టార్స్..!!

ఆ నలుగురే స్టార్స్..!!

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒకసారి హీరోగా నటించాక.. ఆ చట్రంలోనే ఇరుక్కుపోతుంటారు. చిన్న చిన్న పాత్రల్లో నటించేందుకు ససేమిరా అంటుంటారు.  అలా కాకుండా మంచి ఆఫర్ దొరికితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లేదంటే మరో హీరోగా చేసేందుకు ఇప్పుడున్న హీరోలు పెద్దగా ఆసక్తి చూపడంలేదు.  ఇది వేరే విషయం అనుకోండి.  తెలుగులో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నారంటే చాలామంది అని చెప్తుంటారు.  నాగసౌర్య మాత్రం టాలీవుడ్ లో నలుగురే స్టార్ హీరోలు అంటున్నారు.  ఆ నలుగురు ఎవరో కాదు.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.  ఈ నలుగురు హీరోలు స్టార్ హీరోలుగా ఎదగడానికి చాలా కష్టపడ్డారు.  చాలా సినిమాలు చేశాక స్టార్ హోదా సంపాదించుకున్నారు.  స్టార్ డమ్ అన్నది ఒక్కరోజులో రాదు.  ఇప్పుడు వస్తున్న నవతరం హీరోలు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది అంటున్నాడు నర్తనశాల హీరో నాగశౌర్య.