నాగశౌర్య తన ‘లక్ష్యా’న్ని ఛేదిస్తాడా..

నాగశౌర్య తన ‘లక్ష్యా’న్ని ఛేదిస్తాడా..

నాగశౌర్య మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఆర్చరీ క్రిడా నేపథ్యంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా శౌర్య కెరీర్‌లో 20వది. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపుడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలో నేడు ఈ సినిమా పేరును విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్చరీ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి ముందుగా పార్థు, అర్జున అనే మరికొన్ని పేర్లను అనుకున్నప్పటికీ.. చివరికి ’లక్ష్య‘ పేరును ఖరారు చేశారని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ పేరు వినగానే దాదాపు అందరికీ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా అప్పట్లో హిట్ కూడా అయ్యింది. టాలీవుడ్‌లో గోపీచంద్ కూడా లక్ష్యం అంటూ విజయం దక్కించుకున్నడు. మరి ఈ సారి శౌర్యా ఎంతవరకు విజయం సాధిస్తాడో చూడాలి.