పవన్ కళ్యాణ్ సినిమాల గురించి క్లారిటీ ఇచ్చిన నాగబాబు

పవన్ కళ్యాణ్ సినిమాల గురించి క్లారిటీ ఇచ్చిన నాగబాబు

జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.  ఆ ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీని కొంతకాలం పక్కన పెట్టి సినిమాల్లో చేస్తారని పుకార్లు వచ్చాయి.  ఈ పుకార్లకు నాగబాబు చెక్ పెట్టాడు.  

పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించే అవకాశం లేదని..తప్పదు చేయాలి అని పట్టుబడితే గెస్ట్ రోల్ చేసేందుకు అవకాశం ఉంటుంది గాని, పూర్తి స్థాయి హీరోగా చేయడం మాత్రం చేయడని నాగబాబు అంటున్నాడు.  రాజకీయాల్లోనే ఉండి ప్రజాక్షేత్రంలో తానేమిటో నిరూపించుకుంటాడని నాగబాబు చెప్తున్నాడు.