మన రక్తం చల్లబడి పోయింది... నాగబాబు మరో ట్వీట్

మన రక్తం చల్లబడి పోయింది... నాగబాబు మరో ట్వీట్

ఈ మధ్య మెగా బ్రదర్ నాగబాబు వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. షూటింగ్స్ కు అనుమతి కోసం ప్రభుత్వాన్ని సంప్రదించినపుడు తనను పిలవలేదని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నాగబాబు స్పందించడం ఆయనకి వార్నింగ్ఇవ్వడం టాలీవుడ్ లో పెద్ద చర్చ అయినా విషయం తెల్సిందే .ఇండస్ట్రీకి సంబందించిన కొందరు బాలకృష్ణకు సపోర్ట్ చేస్తూ నాగబాబు కు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత నాగబాబు తెలుగు దేశం పార్టీని టార్గెట్ చేసుకొని ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు. తాజాగా మరోసారి నాగబాబు ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు. ఈ సారి ఆయన రౌడీలను గుండాలను టార్గెట్ చేశారు.  ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో 'భారతీయుల రక్తం శాంతి,అహింస మంత్రాలతో,చల్లబడిపోయింది.తిరిగి రక్తం వేడెక్కలంటే ఛత్రపతి శివాజీ,రాణా ప్రతాప్ సింగ్,అశోక చక్రవర్తి,సామ్రాట్ పృథ్విరాజ్ చౌహన్,శ్రీకృష్ణ దేవరాయలు,రాజ రాజ చోళుడు,సముద్రగుప్తుడు,మొదలైన మహావీరుల కథలని పిల్లలతో చదివిస్తే నెక్స్ట్ జనరేషన్ ఆయనా సాహసం,పౌరుషం,మరిగే రక్తం తో పెరుగుతారు.ఎలాగూ మన రక్తం చల్లబడి పోయింది.వాళ్ళనన్నా దేశానికి ఉపయోగ పడే వీరులు గా తయారు చేద్దాం.భారత దేశానికి ,దేశాన్ని ప్రేమించేవీరులు కావాలి,డబ్బుకు ఓట్లు వేసే సాధారణ పౌరులు కాదు.దేశాన్ని పట్టి పీడిస్తున్న దేశద్రోహులు,గుండాలు,మాఫియా,ఫ్యాక్షన్ ,గుండా రాజకీయనాయకులు,కుహనా ఉదారవాదులు,ఉగ్రవాదుల నించి ఈ దేశాన్ని కాపాడే వీరులు కావాలని నా కోరిక.ప్రతి నేరాన్ని పోలీస్ ,మిలిటరీ మాత్రమే డీల్ చెయ్యాలంటే కుదరని పని." అంటూ రాసుకొచ్చారు.