ఓటేసిన మజిలీ స్టార్స్

ఓటేసిన మజిలీ స్టార్స్

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది.  సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఓటు హక్కున్న అందరు పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  ఈ ఉదయం మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఓటు హక్కును వినియోగించుకోగా, మధ్యాహ్నం సమయంలో మజిలీ స్టార్స్ నాగచైతన్య, సమంతలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.  

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.  మజిలీ సినిమా హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు నాగచైతన్య, సమంతలు కృతజ్ఞతలు తెలియజేశారు.