ఆ ప్రశ్నకు నాగచైతన్య ఎలా సమాధానం చెప్పారో తెలుసా..?

ఆ ప్రశ్నకు నాగచైతన్య ఎలా సమాధానం చెప్పారో తెలుసా..?

మజిలీ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతున్నది.  ఇందులో హీరోహీరోయిన్లుగా చేసిన నాగచైతన్య, సమంతలు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.  నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతున్నారు.  వారు అడిగే ప్రశ్నలకు రిలాక్స్ గా సమాధానం చెప్తున్నారు.  సెలెబ్రిటీలను ప్రశ్నించడం అంటే ప్రతి అభిమానికి చాలా ఇష్టంగా ఉంటుంది.  అందులో సమంత వంటి స్టార్స్ తో మాట్లాడటం అంటే చెప్పాల్సింది ఏముంటుంది.  

ఓ మహిళా అభిమాని నాగచైతన్యను ఓ చిలిపి ప్రశ్న అడిగింది.  మా ఆయనకు సమంత అంటే పిచ్చి అని.. ఆమెను విపరీతంగా ప్రేమిస్తున్నారని.. ఎలా కంట్రోల్ చేయాలో తెలియడంలేదని అడిగింది.. దీనికి నాగచైతన్య చాలా కూల్ గా తెలివిగా సమాధానం చెప్పారు.  అతన్ని తన దగ్గరకు ఒకసారి పంపాలని, తక్కువ సమయంలోనే సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు.  దానికి ఆ మహిళా అభిమాని మరో ప్రశ్నను సంధిస్తూ..ఏం చేస్తారు అని అడిగితె.. కలిస్తే చెప్తాను అని సమాధానం ఇచ్చాడు చైతన్య.  నిజాయితీగా ప్రేమను ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయైనా ఇష్టపడుతుందని మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు చైతన్య.. సమంత దంపతులు.