చైతు.. శ్యామ్ లు ఎంత తీసుకున్నారో తెలుసా..?

చైతు.. శ్యామ్ లు ఎంత తీసుకున్నారో తెలుసా..?

నాగ చైతన్య నటిస్తున్న సినిమాలు వరసగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి.  యుద్ధం శరణం,  శైలజా రెడ్డి అల్లుడు, ఇటీవలే వచ్చిన సవ్యసాచి ఇలా వరసగా ప్లాప్ అవుతుండటంతో.. నెక్స్ట్ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.  అటు సమంత వరస విజయాలతో దూసుకుపోతున్నది.  పెళ్ళైన తరువాత ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా మజిలీ.  

పెట్టి తరువాత కుటుంబంలో జరిగే విషయాల ఆధారంగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్నది.  ఈ సినిమా కోసం చైతు.. శ్యామ్ లు జాయింట్ గా రూ. 6.50 కోట్లు పారితోషికం అందుకున్నారట.  ఇప్పటికే సినిమా 50% షూటింగ్ కంప్లీట్ చేసుకున్నది.  సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తారట.