చైతూను మళ్ళీ ఫ్లాట్ చేసిన సమంత..!!

 చైతూను మళ్ళీ ఫ్లాట్ చేసిన సమంత..!!

నాగచైతన్య.. సమంత సూపర్ జోడి.  రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా.  ఈ ఇద్దరు కలిసి చేసిన నాలుగు సినిమాల్లో మూడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి.  ఇక పెళ్లి తరువాత కూడా సమంత అదిరిపోయే సినిమాలు చేస్తోంది.  రీసెంట్ గా సమంత చేసిన సూపర్ డీలక్స్, మజిలీ సినిమాలు ఏ స్థాయిలో హిట్ కొట్టాయో చెప్పక్కర్లేదు.  

ఇప్పుడు ఓ బేబీ రూపంలో మరో సినిమా రాబోతున్నది.  జులై 5 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాను భర్త నాగచైతన్య ఇప్పటికే చూశారట.  సినిమా చూస్తున్నంత సేపు చైతు చాలా ఎంజాయ్ చేసినట్టు సమంత చెప్పింది.  సమంత నటనతో చైతూని మెప్పించిందట.  ఓ బేబీ సూపర్బ్ గా ఉందని మెచ్చుకున్నట్టు సమంత చెప్పుకొచ్చింది.  సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.