మిలిటరీ ఆఫీసర్ గా చైతూ..!!

మిలిటరీ ఆఫీసర్ గా చైతూ..!!

వెంకటేష్.. నాగ చైతన్య హీరోలుగా చేస్తున్న వెంకిమామ సినిమా షూటింగ్ రీసెంట్ గా గోదావరి జిల్లాలో మొదలైంది.  బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ ఫుట్, రాశి ఖన్నాలు హీరోయిన్లు.  ఈ సినిమాలో నాగచైతన్య పాత్రను రివీల్ చేశారు.  నాగచైతన్య మిలటరీ ఆఫీసర్ గా కనిపిస్తే... వెంకటేష్ రైస్ మిల్ ఓనర్ గా కనిపిస్తున్నట్టు సమాచారం.  

రైస్ మిల్ ఓనర్ గా పల్లెటూరిలో వెంకటేష్ నవ్వులు పూయిస్తాడని.. నాగచైతన్య వచ్చాక ఈ కామెడీ మరింతగా పెరుగుతుందని అంటున్నారు.  కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది.