చైతూను గెలిపించడానికి మామల పోరాటం..!!

చైతూను గెలిపించడానికి మామల పోరాటం..!!

నాగచైతన్య సినిమాలు వరసగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతుండటంతో అక్కినేని హీరో ఆందోళన చెందుతున్నాడు.  కెరీర్ స్టార్టింగ్ లో మంచి విజయాలు అందుకున్న ఈ హీరోకు వరస దెబ్బలు తగులుతున్నాయి.  దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని తపించిపోతున్నాడు.  ప్రస్తుతం ఈ యువ సామ్రాట్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.  అందులో ఒకటి భార్య సమంతతో కలిసి నటిస్తున్న మజిలీ కాగా, రెండో సినిమా వెంకిమామ.  

భార్యాభర్తల మధ్య జరిగే కలహాలతో మజిలీ సినిమా తెరకెక్కుతున్నది.  ఈ సినిమాపై అంచనాలు ఉన్నా.. సినిమాను ఎలా తెరకెక్కిస్తారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.  రెండో సినిమా వెంకిమామ.  

విక్టరీ వెంకటేష్.. నాగ చైతన్య హీరోలుగా ఈ సినిమా తెరకెక్కుతున్నది.  బాబీ దర్శకుడు.  సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతున్నది.  దీనిపైనే చైతు ఆశలు పెట్టుకున్నాడు.  కాగా, వెంకిమామ సినిమా ఒరిజినల్ స్టోరీ కాదని, వేరే భాషలో హిట్టైన సినిమా రైట్స్ తీసుకొని ఈ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి నిర్మిస్తున్నారని సమాచారం.  ఏది ఎలా ఉన్నా.. అల్లుడు నాగచైతన్యను ప్రమోట్ చేయడానికి మామలైన వెంకటేష్, సురేష్ బాబులు బాగా కష్టపడుతున్నారు.