రివ్యూ: మజిలీ

రివ్యూ: మజిలీ

నటీనటులు: నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్, రావు రమేష్, పోసాని తదితరులు 

సంగీతం : గోపిసుందర్ 

బిజీయం : థమన్ 

సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ 

నిర్మాత: సాహు గారపాటి, హరీష్ పెద్ది 

దర్శకత్వం: శివ నిర్వాణ 

ఏం మాయ చేశావే సినిమా నాగచైతన్య.. సమంత కెరీర్లో బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు.  ఆ తరువాత ఇద్దరు కలిసి మనం చేశారు.  అది సూపర్ హిట్టైంది.  ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఇద్దరు కలిసి మజిలీ చేశారు.  వీరిద్దరి వివాహం తరువాత ఇద్దరు కలిసి నటించిన సినిమా కావడంతో ఆసక్తి ఏర్పడింది.  ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  మరి మజిలీ అంచనాలను అందుకుందా లేదా చూద్దాం.  

కథ: 

నాగచైతన్య వైజాగ్ లో అందరి కుర్రాళ్ళమళ్ళే క్రికెట్ ఆడుతూ, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.  ఎలాగైనా మంచి ప్లేయర్ కావాలని కలలు కంటాడు.  అదేసమయంలో నాగ చైతన్యకు హీరోయిన్ దివ్యాన్షపరిచయం అవుతుంది. న్యావి ఆఫీసర్ కూతురు.  పెద్ద ఫ్యామిలీ.  ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది.  లోకల్ రాజకీయాల కారణంగా దివ్యాన్ష నాగచైతన్యకు దూరం అవుతుంది.  ఇదే సమయంలో తనకు ఇష్టం లేకుండానే సమంతను వివాహం చేసుకుంటాడు.  సమంత నాగచైతన్య జీవితంలోకి వచ్చాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి..? కుటుంబంలో వచ్చిన సమస్యలు ఏంటి? చైతన్య మారాడా లేదా అన్నది మిగతా కథ. 

విశ్లేషణ; 

లవ్, సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా... ఈ మూడు మజిలీ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి.  ఫస్ట్ హాఫ్ అంతా లవ్, ఎంజాయ్, రొమాంటిక్ గా సాగుతుంది.  నరేషన్ కొద్దిగా స్లోగా ఉన్నా స్టోరీ పరంగా అది పెద్ద ఇష్యూ అనిపించదు.  నాగచైతన్య క్రికెట్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లు ప్లస్ అయ్యాయి.  లవ్, దివ్యాన్ష..నాగచైతన్య లిప్ కిస్ లాంటి సీన్స్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతాయి.  నాగచైతన్య డిఫరెంట్ వేరియేషన్స్ లో డిఫరెంట్ ఆటిట్యూడ్ లో బాగా పెర్ఫర్మ్ చేశాడు.ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోతుంది.  

సెకండ్ హాఫ్ లో సమంత తన కెరీర్లోనే బెస్ట్ యాక్టింగ్ ను ఇచ్చింది.  మధ్యతరగతి గృహిణిగా, భర్తను మార్చుకునే విధానంలో సమంత పడిన కష్టం తెరపై చూసి తీరాల్సిందే.  నాగచైతన్య... సమంతల మధ్య పెద్దగా డైలాగులు లేవు.  కానీ, ఇద్దరి మధ్య వచ్చే ఎమోషన్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది.  ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎమోషన్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి.  

నటీనటుల పనితీరు: 

నాగచైతన్య.. సమంతలు పోటీపడి మరి నటించారు.  నటించారు అనే కంటే జీవించారని చెప్పొచ్చు.   వీరితో పాటు సెకండ్ హీరోయిన్ యాక్టింగ్ సినిమాకు ప్లస్ అయింది.  నాగచైతన్య తండ్రిగా రావు రమేష్ యాక్టింగ్ సూపర్బ్.  ఒక మధ్యతరగతి కుటుంబంలో తండ్రి ఎలా ఆలోచిస్తాడో... రావు రమేష్ పాత్రలో మనం స్పష్టంగా చూడొచ్చు.  అలాగే సమంత తండ్రిగా చేసిన పోసాని తన నటనతో మెప్పించాడు.  మిగతా నటీనటులు వారి పరిధిమేర మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

దర్శకుడు శివ నిర్వాణ తీసుకున్న కథ పాతదే అయినప్పటికి కథను నడిపించిన తీరు అద్భుతం అని చెప్పాలి.  లవ్ అండ్ కెరీర్లో ఫెయిలైన ఓ వ్యక్తి జీవితంలోకి ఇష్టంలేని అమ్మాయి వస్తే... అతని జీవితం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ను తెరపై చూపిన విధానం చాలా బాగుంది. శివ ఆలోచనలను సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ తెరపై ప్రజెంట్ చేసిన తీరు అమోఘం.  అటు గోపి సుందర్ మ్యూజిక్ సినిమాకు తగ్గట్టుగా ఉంది. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు 100% ప్లస్ అయ్యింది.  

పాజిటివ్ పాయింట్స్: 

కథ 

కథనాలు 

నటీనటులు 

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 

మైనస్ పాయింట్స్ : 

అక్కడక్కడా  స్లో నేరేషన్ 

చివరిగా : మజిలీ సెంటిమెంట్ వర్కౌటైంది