నాగచైతన్య సాధించేశాడు..!!

నాగచైతన్య సాధించేశాడు..!!

గత కొంతకాలంగా నాగచైతన్యకు హిట్ లేదు.  వరసగా రెండు సినిమాలు పరాజయం పాలవ్వడంతో ఇబ్బందుల్లో పడ్డ చైతు ఎలాగైనా హిట్ కొట్టాలని మజిలీ చేశాడు.  మధ్యతరగతి కుటుంబంలో భార్యాభర్తల అనుబంధం, చిన్న చిన్న గొడవలను బేస్ చేసుకొని శివ నిర్వాణ సినిమాను తెరకెక్కించాడు.  ప్రతి ఒక్కరి సబ్జెక్ట్ కావడంతో బాగా ఎక్కింది.  హిట్ టాక్ నుంచి సమ్మర్ సూపర్ హిట్ గా మారిపోయింది.  

మీడియం బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ. 22 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది.  కాగా, మజిలీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ను వసూలు చేసినట్టు సమాచారం అందుతోంది. మొదటి ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ తెచ్చుకున్న ఈ సినిమా నిర్మాతలకు, బయ్యర్లకు లాభాల పంట పండిస్తోంది.