ఫీలింగ్స్ బయటపెట్టిన నాగచైతన్య..!!

ఫీలింగ్స్ బయటపెట్టిన నాగచైతన్య..!!

నాగచైతన్య.. సమంత జంటగా నటిస్తున్న సినిమా మజిలీ.  ఇప్పటికే సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.  టీజర్ దానికి ప్రాణం పోసింది.  తాజాగా ఈ సినిమా నుంచి వన్ బాయ్ వన్ గర్ల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.  మనసులో ఒకమ్మాయిని ఉంచుకొని, నాన్నకు  ఇచ్చిన మాటకోసం, అమ్మ అలిగిందని చెప్పి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. అమ్మాయితో ఉండలేక.. మనసులో ఉన్న అమ్మాయిని మర్చిపోలేక ఒక అబ్బాయి పడే బాధను పాట రూపంలో అద్భుతంగా చూపించారు.  

భాస్కరభట్ల సింపుల్ లిరిక్స్ సింపుల్ గా మనసుకు హత్తుకునే విధంగా ఉన్నాయి.  గోపి సుందర్ మ్యూజిక్ మరోసారి హైలైట్ గా నిలిచింది.  ఈ సాంగ్ రిలీజ్ తరువాత.. సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయింది.  ఏప్రిల్ 5 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  మరి ఈ హైప్ ను సినిమా ఎలా క్యాష్ చేసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.