రిలీజ్ కు ముందే లాభాలు చూపించిన చైతు..!!

రిలీజ్ కు ముందే లాభాలు చూపించిన చైతు..!!

గతంలో నాగచైతన్య మాస్ హీరోగా మెప్పించేందుకు చేసిన వరస ప్రయత్నాలు విఫలం అయ్యాయి.  నాగచైతన్యకు మాస్ కంటే క్లాస్ లుక్, లవ్ స్టోరీస్ బాగా కలిసొచ్చాయి.  ఏం మాయ చేశావే, వేడుక చేద్దాం రారండోయ్ సినిమాలు ఇందుకు ఉదాహరణలు.  ఇప్పుడు మరో ప్రయోగం చేయబోతున్నాడు చైతు. 

మధ్యతరగతి యువకుని కథతో నాగచైతన్య.. సమంతలు జంటగా చేస్తున్న మజిలీ సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది.  బలమైన కథ, సున్నిమతమైన కథనాలతో సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది.  రీసెంట్ గా రిలీజైన రెండు సింగిల్స్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.  అందుకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.  శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా దాదాపు రూ.15 కోట్ల రూపాయలు ఆర్జించినట్టు తెలుస్తోంది.  సినిమా రిలీజ్ కు ముందే భారీ లాభం రావడంతో నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  సినిమా రిలీజ్ తరువాత బాగుంది అనే టాక్ వస్తే.. నాగచైతన్య కెరీర్ మరలా గాడిలో పడ్డట్టే.