నైజాంలో మజిలీ హవా

నైజాంలో మజిలీ హవా

నాగచైతన్య మజిలీకి పాజిటివ్ వైబ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే.  ప్రమోషన్స్ విషయంలో కూడా యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంది.  పగడ్బందీగా ప్రమోషన్స్ ను చేస్తున్నది.  ఏప్రిల్ 5 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  తనకు నచ్చిన గేమ్, లవ్ లో ఫెయిలైన యువకుడు ముందుకు బానిసలా మారిపోతాడు.  అలా బానిసైన వ్యక్తిని తిరిగి మంచి వాడిగా అతని భార్య ఎలా మార్చుకుంది అనే కథ.  

కథ సింపుల్ గా ఉన్నా.. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, రొమాన్స్ తెరపై బాగా వచ్చాయని ఇప్పటికే టాక్ రావడంతో సినిమాపు హైప్ వచ్చింది.  రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నైజాంలో200 థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నది.