మజిలీ రన్ టైమ్ ఎంతంటే..!!

మజిలీ రన్ టైమ్ ఎంతంటే..!!

నాగచైతన్య... సమంత జంటగా చేస్తున్న మజిలీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున జరిగింది.  దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా రూ.21 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేసుకుంది.  సెంటిమెంట్, ఎమోషన్స్ వర్కౌటైతే, సినిమా రూ.21 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేమి కాదు.  

మజిలీ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ బయటకు వచ్చింది.  2 గంటల 34 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల అంశాలు ఉన్నాయని యూనిట్ చెప్తోంది.  ఇప్పటికే సినిమాకు పాజిటివ్ బజ్ రన్ అవుతున్నది.  ఈ పాజిటివ్ బజ్ సినిమా రిలీజ్ తరువాత కూడా ఉంటె... చైతు కెరీర్ టర్న్ అయినట్టే.