మహాసముద్రం అంటున్న చైతు

మహాసముద్రం అంటున్న చైతు

ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో నాగచైతన్య మజిలీ ఒకటి.  చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగచైతన్యకు ఈ సినిమా మంచి ఊరటను ఇచ్చింది.  ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి వెంకిమామ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు.  కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కుతోంది.  

దీనితరువాత, చైతు.. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో కలిసి సినిమా చేయబోతున్నాడు.  ఇప్పటికే కథ ఒకే అయినట్టు తెలుస్తోంది.  మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీ.  ఇందులో చైతు పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడట.  దీనికి మహాసముద్రం అనే టైటిల్ ను అనుకుంటున్నారని సమాచారం.  ఇదే నిజమైతే చైతన్య కెరీర్లో మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నట్టు అవుతుంది.  ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తారట.