చైతు.. సాయి పల్లవి .. లవ్ స్టోరీ
నాగచైతన్య మజిలీ సినిమా తరువాత జోష్ పెంచాడు. ప్రస్తుతం వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా ప్లాన్ చేశారు. సాయి పల్లవి హీరోయిన్. ఈ మూవీ కూడా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
శేఖర్ కమ్ముల ఈ సినిమాకు క్యాచీగా ఉండే టైటిల్ ను పెట్టాలని అనుకుంటున్నారని సమాచారం. గతంలో గోదావరి, హ్యాపీ డేస్, ఫిదా సినిమా టైటిల్స్ ఎంత క్యాచీగా ఉన్నాయో అలాంటి టైటిల్ నే అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమా పూర్తిగా లవ్ స్టోరీతో కూడిన సినిమా కాబట్టి, దీనికి లవ్ స్టోరీ అనే టైటిల్ అనుకున్నారని తెలుస్తోంది. ఫైనల్ షెడ్యూల్ జరుపుకోబోతున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)