నాగచైతన్య... సమంత ఎలా మారిపోయారో చూశారా..?

నాగచైతన్య... సమంత ఎలా మారిపోయారో చూశారా..?

నాగచైతన్య.. సమంత జంటగా నటించిన మజిలీ సినిమా ఏప్రిల్ 5 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.  వన్ బాయ్ వన్ గర్ల్ సింగ్ సూపర్ హిట్టైంది.  ఇప్పుడు రెండో సింగిల్ ను రిలీజ్ చేసేందుకు యూనిట్ రెడీ అయ్యింది.  

రేపు సాయంత్రం 4:59 గంటలకు ఈ సాంగ్ రిలీజ్ కాబోతున్నది.  దీనికి సంబంధించిన పోస్టర్ ను తాజా రిలీజ్ చేశారు.  నాగచైతన్య చాలా స్మార్ట్ గా ఉన్నాడు.  అటు సమంత కూడా బరువు తగ్గి స్మార్ట్ గా కనిపించింది.  కాలేజీ యూనిఫామ్ లో ఈ జంట అందంగా ఉంది.  కాలేజీ రోజుల్లో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ వచ్చే మాంటేజ్ సాంగ్ లోని సీన్ లా ఉంది ఆ ఫోటో.  వన్ బాయ్ వన్ గర్ల్ సాంగ్ లానే ప్రియతమా... ప్రియతమా సాంగ్ కూడా హిట్ కావాలని కోరుకుందాం.