వీడియో లీక్ - చైతూ ఇంట్రో సీన్ అదుర్స్

వీడియో లీక్ - చైతూ ఇంట్రో సీన్ అదుర్స్

సవ్యసాచి తరువాత నాగ చైతన్య... సమంతలు కలిసి మజిలీ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తయింది.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ నడుస్తున్నాయి.  ఈ సినిమా పూర్తైన వెంటనే నాగచైతన్య.. వెంకటేష్ తో కలిసి చేస్తున్న వెంకిమామ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. 

రెండు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.  ప్రస్తుతం గోదావరి ఒడ్డున షూటింగ్ జరుగుతున్నది.  నాగచైతన్య తన మామ వెంకటేష్ ఉన్న ఊర్లోకి వచ్చే సీన్.  గోదావరిలోనుంచి పడవ దిగి వస్తున్న నాగచైతన్యను వెంకటేష్ దగ్గరుండి ఆహ్వానించే సీన్.  ఈ సీన్ కు సంబంధించిన 29 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది.  

గోదావరి ఒడ్డున పండుగలాంటి వాతావరణం ఉంటుంది.  అప్పుడే పడవ వచ్చి ఆగింది.  అందులో నుంచి నాగచైతన్య దిగుతాడు.  అక్కడే ఉన్న వెంకటేష్ .. నాగచైతన్యకు స్వగతం పలుకుతాడు.  ఈ సీన్ లో నాగచైతన్య చాలా జోష్ గా కనిపించాడు.  చిన్న లీక్డ్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.