ఆ లారీకి దేశంలోనే అత్యధిక జరిమానా !

ఆ లారీకి దేశంలోనే అత్యధిక జరిమానా !

ట్రాఫిక్‌ జరిమానాల పుణ్యమాని ప్రజల సంపాదన గురించి పక్కన పెడితే వారి జేబులకు మాత్రం చిల్లులు పడుతున్నాయి.  నాగాలాండ్ కు చెందిన ఓ లారీకి దిమ్మదిరిగిపోయే రీతిలో ఫైన్ వేశారు ఒడిశా రవాణా శాఖ అధికారులు. పత్రాలు సరిగాలేవంటూ నాగాలండ్ లారీకి ఏకంగా రూ.6.53లక్షల జరిమానా విధించారు. మొత్తం ఏడు నియమాల ఉల్లంఘనలకు గానూ దిలీప్‌ కర్తా అనే డ్రైవర్‌కు ఒడిషాలోని సంబల్‌పూర్‌ ఆర్టీఏ అధికారులు ఇంత మొత్తంలో చలానా జారీ చేశారు. నాగాలాండ్‌ నికి చెందిన ఆ వాహనానికి వేసిన జరిమానాను చూసి ట్రక్కు ఓనర్‌ శైలేష్ శంకర్‌ నోరెళ్లబెట్టాడు.

గత ఐదేళ్లుగా రోడ్డు ట్యాక్స్‌ కట్టనందుకు రూ.6,40,500 జరిమానా వేశారు. అలాగే గూడ్స్ వెహికల్ లో ప్రయాణికులను ఎక్కించుకున్నందుకు, తప్పు అంగీకరించనందుకు తదితర కారణాలు చూపి రూ.6.53లక్షలు వసూలు చేశారు. అయితే ఇదంతా కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత అనుకుంటే పొరపాటే.ఆగస్టు 10న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు దేశంలో విధించిన జరిమానాలన్నింటిలోకి ఇదే హయ్యస్ట్ అని చెప్పాలి. ఇంత జరిమానా చూసి లారీ యజమానికి కళ్లు బైర్లు కమ్మి ఉంటాయేమో !