గాలిని పంపినట్టే కేసీఆర్‌ని జైలుకు పంపుతా...

గాలిని పంపినట్టే కేసీఆర్‌ని జైలుకు పంపుతా...

గాలి జనార్దన్ రెడ్డిని జైలుకి పంపినట్టుగానే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కూడా జైలుకు పంపుతానని హెచ్చరించారు కాంగ్రెస్ నేత  నాగం జనార్ధన్ రెడ్డి... ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన... కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 1 నుంచి 28 చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే... కాంగ్రెస్ చేసిన వాటిని కూడా తానే చేశానని చెప్పుకునే దౌర్భాగ్యంలో కేసీఆర్ ఉన్నారంటూ మండిపడ్డారు. ఇక పాలమూరులో ఉన్న ప్రాజెక్టుల్లో 90 శాతం పూర్తయినవే... 10 శాతం పనులు కూడా నాలుగేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు నాగం.

రూ. 500 కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు నాగం... ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని... సీఎం కేసీఆర్ అవినీతి బయటపెడతానని... నిరూపించకపోతే రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించారు. ఇక ప్రాజెక్టుల కింద పొరుగు జిల్లాల రైతులకు రూ. 12 లక్షలు పరిహారం ఇస్తున్నారు... మా జిల్లాలో రైతులకు మాత్రం రూ. 3 లక్షలే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు నాగం జనార్ధన్ రెడ్డి... ప్రాజెక్టుల్లో రూ. 5,780 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన ఆయన... దీనిపై కోర్టులో కేసు వేస్తానన్నారు.