'ఆ కుటుంబం మాత్రమే దనికం అవుతుంది'

'ఆ కుటుంబం మాత్రమే దనికం అవుతుంది'

తెలంగాణ సాదించాం అనే తృప్తి ఉంది కానీ.. తెలంగాణ రాబందుల చేతుల్లోకి పోయింది. రాష్ట్రం పేదది అవుతుంది.. ఆ కుటుంబం మాత్రం దనికం అవుతుందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ... పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను అడ్డుకోవడానికి కేసులు వేయలేదు. ప్రాజెక్ట్ ల పేరుతో జరిగే అవినీతికి వ్యతిరేకంగా మాత్రమే కేసు వేశామన్నారు. అమాయక అడ్వకేట్లను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం నాపై ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. సుప్రీంకోర్టుకు న్యాయం కోసం వెళ్ళాను. నా ఇంట్రెస్ట్ కోసం కాదు.. ప్రజల ప్రయోజనం కోసం కోర్టుకి వెళ్లానని నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. 

న్యాయవాదులు గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు. మీరు మంత్రులు, ముఖ్యమంత్రి కబంధ హస్తాల్లో చేరొద్దని నాగం కోరారు. మా న్యాయవాదిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మా న్యాయ వాది అలాంటి వాడు కాదన్నారు. నన్ను కేసులు వెనక్కి తీసుకోవాలని వత్తిడి పెంచుతున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి న్యాయవాదులను పిలిచి మాపై మాట్లాడించుడు ఎందుకు, చేతనైతే కోర్టులో వాదించవచ్చు కదా అని నాగం అన్నారు.