ఈసారికి నాగార్జునతో కానిచ్చేస్తారా ?

ఈసారికి నాగార్జునతో కానిచ్చేస్తారా ?

 

తెలుగులో విజయవంతమైన రియాలిటీ షో బిగ్ బాస్.  ఇప్పటికే రెండు సీజన్లు ముగిశాయి.  మొదటి సీజన్ కు జూ. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా రెండవ సీజన్ ను హీరో నాని హోస్ట్ చేశాడు.  త్వరలో మొదలుకానున్న 3వ సీజన్ ను ఎన్టీఆర్ చేత హోస్ట్ చేయించాలనుకున్నారు స్టార్ మా యాజమాన్యం.  కానీ ఎన్టీఆర్ రాజమౌళి సినిమాతో బిజీగా ఉండటం వలన ఆయన డేట్స్ కుదరలేదు.  దీంతో యాజమాన్యం నాగార్జున వైపు దృష్టి సారించారు.  అయితే నాగ్ ఇంకా తన నిర్ణయాన్ని తెలపాల్సి ఉంది.  నాగార్జున గతంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకు వ్యాఖ్యాతగా అలరించిన సంగతి తెలిసిందే.