మొదట్లో ఈ సినిమాను నమ్మలేదు - నాగార్జున

మొదట్లో ఈ సినిమాను నమ్మలేదు - నాగార్జున

సుశాంత్ హీరోగా, రాహుల్ రవీంద్రన్ రూపొందించిన చిత్రం 'చి.ల.సౌ'.  ఈ సినిమా అన్ని పనుల్ని పూర్తిచేసుకుని ఈ నెల 3న విడుదలకానుంది.  ఈ చిత్రాన్ని నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.  ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ మొదట్లో అసలు ఈ సినిమాపై తనకు నమ్మకం లేదని అన్నారు. 

కానీ నాగ చైతన్య చెప్పడం మూలాన వెళ్లి సినిమా చూశానని, మొదలైన కాసేపటికే ఆశ్చర్యంగా సినిమా తనకు నచ్చిందని, తర్వాత వెంటనే నిర్మాతలతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని సినిమాను విడుదలచేసే బాధ్యత తీసుకున్నానని అన్నారు.  అలాగే రవీంద్రన్ తర్వాత సినిమా తన బ్యానర్లోనే ఉంటుందని కూడ చెప్పారు.