నేను సైతం అంటూ ముందుకొచ్చిన నాగార్జున !

నేను సైతం అంటూ ముందుకొచ్చిన నాగార్జున !

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా ఎంతో మంది ముందుకొస్తున్నారు.  అలాంటివారిలో మన తెలుగు హీరోలు ప్రథమంగా కనిపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు విరాళాల్ని ప్రకటించగా ఇప్పుడు నాగార్జున కూడ అమలతో కలిసి ముందుకొచ్చారు. 

ఇలాంటి కష్ట సమయంలో కేరళ ప్రజలకు మన అండదండలు ఎంతో అవసరం అందుకే మా వంతు సాయంగా 28 లక్షల రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపిస్తున్నాము. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేరళ ప్రజల్ని ఆదుకోవాలని కోరుతున్నాము అన్నారు.