మరో పీరియాడిక్ డ్రామా మూవీలో నాగ్..!!

మరో పీరియాడిక్ డ్రామా మూవీలో నాగ్..!!

నాగార్జున సోలో హీరోగా కంటే మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.  సీనియర్ స్టార్స్ తో కాకుండా.. యువ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఉత్సాహంగా ఉన్నాడు నాగార్జున.  ప్రస్తుతం నాగ్.. నాని తో కలిసి దేవదాస్, రన్బీర్ కపూర్ తో కలిసి బ్రహ్మాస్త్ర చేస్తున్నారు.  

దేవదాస్ సెప్టెంబర్ 27 న రిలీజ్ కాబోతున్నది.  అటు బ్రహ్మాస్త్ర షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఈ రెండు సినిమాలతో పాటు నాగ్ మరో మల్టీస్టారర్ లో నటించేందుకు ఇటీవలే కమిట్ అయ్యారు.  తమిళ, తెలుగు భాషల్లో ఆ సినిమా నిర్మితం అవుతున్నది.  ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.  స్వాతంత్రానికి పూర్వ కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నది.  ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయింది.  

నాగ్, ధనుష్ తో పాటు ఎస్.జె సూర్య, అదితిరావు హైదరీలు ఇందులో నటిస్తున్నారు.