నాగ్.. చైతుల సాంగ్స్ రిలీజ్ వాయిదా..

నాగ్.. చైతుల సాంగ్స్ రిలీజ్ వాయిదా..

అక్కినేని నాగార్జున, నాని హీరోలుగా వస్తున్న దేవదాస్ సినిమా ఫస్ట్ సింగిల్ ను ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయాల్సి ఉన్నది.  హఠాత్తుగా నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో.. ఆదిత్య మ్యూజిక్ సంస్థ దేవదాస్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టుగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.  

మరోవైపు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అక్కినేని నాగచైతన్య నటిస్తున్న శైలజా రెడ్డి అల్లుడు మూవీ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.  అనుకోని విధంగా ఈ ఉదయం జరిగిన సంఘటనతో ఆ సినిమా సాంగ్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.  ఓ గొప్ప వ్యక్తికి గౌరవ సూచకంగా శైలజా రెడ్డి అల్లుడు సాంగ్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టుగా సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ పేర్కొంది.  తదుపరి రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నది.