ఈ దేవదాస్ ఫారెన్ నుంచి వచ్చాడా..?

ఈ దేవదాస్ ఫారెన్ నుంచి వచ్చాడా..?

నాగార్జున, నాని కాంబినేషన్లో వస్తున్న దేవదాస్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే రిలీజ్ అయింది.  ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోవడంతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది.  దీనిపై ఇప్పుడు అనేక ట్రోల్స్ కూడా వస్తున్నాయి.  ఒక ఫోటో వైరల్ అయినపుడు దానిని ట్రోల్స్ చేయడం మాములే.  నాగార్జున డాన్ గా, నాని డాక్టర్ గా నటిస్తున్నట్టు ఈ పోస్టర్ చూస్తుంటేనే అర్ధం అవుతున్నది.  ఈ పోస్టర్ చూస్తే మనకు ఓ సినిమా గుర్తుకు వస్తుంది.  అదే అనలైస్ థిస్ సినిమా.  ఆ సినిమా కూడా గ్యాంగ్ స్టార్, డాక్టర్ మధ్య జరిగే కథ ఆధారంగా రూపొందినదే.  గ్యాంగ్ స్టర్ కామెడీగా వచ్చిన ఆ సినిమా హాలీవుడ్ లో మంచి విజయాన్ని నమోదు చేసుకున్నది.  

అనలైజ్ థిస్ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని శ్రీరామ్ ఆదిత్య కథను తయారు చేసుకున్నాడా అన్నది ఇప్పుడు సందేహం.  స్ఫూర్తి పొంది తీసిన సినిమాలు ఇటీవల కాలంలో బెడిసి కొడుతున్నాయి.  థ్రిల్లర్ కామెడీ సినిమాలను బాగా హ్యాండిల్ చేయగలదని భలే మంచిరోజు, శమంతకమణి సినిమాల ద్వారా శ్రీరామ్ ఆదిత్య నిరూపించుకున్నారు.  అయితే, ఇద్దరు స్టార్ నటులతో చేస్తున్న సినిమా కాబట్టి దీనిపై అంచనాలు ఉన్నాయి.  పైగా మహానటి సినిమా తరువాత వైజయంతి మూవీస్ వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.  మరి ఈ అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే సెప్టెంబర్ 27 వరకు ఆగాల్సిందే.