మత్తెక్కించిన దేవదాస్ టీజర్

మత్తెక్కించిన దేవదాస్ టీజర్

నాగార్జున, నాని మల్టీస్టారర్ గా వస్తున్న దేవదాస్ సినిమా టీజర్ ఈ సాయంత్రం రిలీజ్ చేశారు.  ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సూపర్బ్ గా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆకాంక్ష సింగ్, రష్మిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.  వైజయంతి మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.  

ఇదిలా ఉంటె, నిన్న టీజర్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ పోస్టర్ లో నాగార్జున కూర్చొని ఉంటె.. ఆ పక్కనే కూర్చున్న నాని ఒక  చిన్న పెగ్ ఇవ్వమని అడుగుతున్నట్టుగా ఉన్నది పోస్టర్. ఇప్పటికే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  

టీజర్ విషయానికి వస్తే.. నాగార్జున, నానీలు కూర్చొని మందు తాగుతుంటారు.  నాగార్జున ఒక గ్లాస్ లో మందుపోసుకొని కూర్చోగా, నాని ఓ గ్లాస్ తీసుకొని చొక్కాకి తుడిచి.. పెగ్ పోయమని అడుగుతాడు.  చిన్న పెగ్ పోసి.. సోడానా మంచి నీళ్లా అని అడుగేలోపే.. రా తాగేస్తాడు.  మరలా పెగ్ పోయామని అడుగుతాడు.  దాసు ఏమైంది ఈవేళ.. అని అడుగుతాడు నాగార్జున.  టీజర్ ను చాలా సింపుల్ గా కట్ చేశారు.