ఈ దేవదాసులు లేచారంటే..

ఈ దేవదాసులు  లేచారంటే..

సి అశ్వినీదత్ నిర్మాణంలో నాగార్జున, నాని హీరోలుగా వస్తున్న మల్టీస్టారర్ సినిమా దేవదాస్.  శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు సాయంత్రం రిలీజ్ అయింది.  నాగార్జున ఒకచేత్తో గన్ను, మరోచేత్తో లిక్కర్ బాటిల్ పట్టుకొని పడుకొని ఉంటాడు.  ఆ పక్కనే నాని స్కెతస్కోప్ పెట్టుకొని పడుకొని ఉంటాడు.  ఇద్దరు పడుకొని ఉన్న లుక్ తో కూడిన ఫోటోను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.  ఈ పోస్టర్ ను బట్టి నాగార్జున డాన్ గా, నాని డాక్టర్ గా కనిపిస్తున్నారని అర్ధం అవుతున్నది.  సెప్టెంబర్ 27 న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ పై ఉన్నది.  మరి సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎలాంటి వసూళ్లు చేస్తుందో చూడాలి.