మెగా ఫ్రేమ్‌లో నాగార్జున.. సంక్రాంతి సంబురాలు

మెగా ఫ్రేమ్‌లో నాగార్జున.. సంక్రాంతి సంబురాలు

అక్కినేని నాగార్జున ఈ సంక్రాంతి పండగ‌ను చిరంజీవి, ఆయన ఫ్యామిలీతో కలిసి సెల‌బ్రేట్ చేసుకున్నారు. మెగాస్టార్ ఇంట జ‌రిగిన సంక్రాంతి వేడుక‌ల‌కు నాగార్జున ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. సంగీతం వింటూ విందు ఆర‌గిస్తూ మెగా హీరోలతో కలిసి సంక్రాంతి వేడుకను ఎంజాయ్ చేయడమే గాక స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.‌ మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున స‌హా మెగా ఫ్యామ‌లీ హీరోలు రామ్‌ చ‌ర‌ణ్‌, వ‌రుణ్‌ తేజ్‌, సాయి ధరమ్ తేజ్‌, అల్లు శిరీశ్, వైష్ణవ్ తేజ్, ఇత‌ర కుటుంబ స‌భ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం మెగా ఫ్రేమ్‌లో నాగార్జున నిల్చున్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక వీరి సినిమాల విష‌యానికి వ‌స్తే నాగార్జున వైల్డ్ డాగ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంటే.. చిరంజీవి ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసి త‌దుప‌రిగా లూసిఫ‌ర్ రీమేక్, వేదాళం రీమేక్‌ను ట్రాక్ ఎక్కించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.