నాగార్జున ఆ కథ విని ఏడ్చేశాడట.. ఎందుకంటే.. 

నాగార్జున ఆ కథ విని ఏడ్చేశాడట.. ఎందుకంటే.. 

నాగార్జున తన కెరీర్లో ఎన్నో సినిమాలు ఎన్నో హిట్స్ అందుకున్నారు.  అన్ని సినిమాలు చేసినా.. ది బెస్ట్ సినిమా ఏంటి అంటే మాత్రం అందరూ చెప్పే సమాధానం అన్నమయ్య అని చెప్తారు.  అన్నమయ్య సినిమాలో అన్నమయ్య పాత్రలో నాగార్జున అనే సరికి అందరూ షాక్ అయ్యారట.  అన్నమయ్య సినిమాలో నాగార్జున ఏంటి అని ప్రశ్నించారు.  వెంకటేశ్వర స్వామిగా సుమన్, భక్తురాలిగా రమ్యకృష్ణ అనే సరికి అసలు ఏం సినిమా తీస్తున్నారని ప్రశ్నించారట చాలామంది.  

కానీ, నాగార్జునకు భారవి కథ చెప్పిన తరువాత నాగ్ కళ్ళు ఎర్రగా మారిపోయాయి.  కన్నీళ్లు పెట్టుకున్నాడు.  కథ చాలా బాగుంది.  కథకు అవార్డులే కాదు డబ్బులు కూడా వస్తాయని చెప్పాడట.  చెప్పినట్టుగానే సినిమా మంచి విజయం సాధించింది.  చిరంజీవి సైతం అలాంటి సినిమా చేయలేకపోయినందుకు బాధపడ్డాడని చాలాసార్లు చెప్పారు.