సినిమా చూసి విదేశాలకు వెళ్ళిపోయిన నాగార్జున !

సినిమా చూసి విదేశాలకు వెళ్ళిపోయిన నాగార్జున !

అక్కినేని నాగార్జున, నానిలు కలిసి నటించిన 'దేవదాస్' చిత్రం రేపు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్బంగా నాగార్జున తన కుటుంబంతో కలిసి సినిమాను వీక్షించారు.  సినిమా చూసిన ఫ్యామిలీ సంతోషించారని, హిట్ సినిమా తన జేబులో ఉందని, సంతోషంగా కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్పుకు వెళుతున్నానని అన్నారు నాగార్జున. 

యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నాగార్జున డాన్ పాత్రలో, నాని డాక్టర్ పాత్రలో నటించారు.  ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఇందులో నాగ్, నానిలు చేసిన ఫన్ బాగా ఆకట్టుకుంటుందని అంటున్న నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ విజయంపై ధీమాగా ఉంది.