మోడీకి నాగార్జున రిప్లై !

మోడీకి నాగార్జున రిప్లై !

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కలిగేలా చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అనేక మంది సెలబ్రిటీలను ట్విట్టర్ ద్వారా కోరిన సంగతి తెలిసిందే.  అలా ఎందోయీ ట్వీట్ చేసిన వారిలో హీరో నాగార్జున కూడా ఉన్నారు.  మీరు చేసిన అనేక సినిమాలు ఎన్నో మిలియన్ల మందిని అలరించాయి, ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.  మీరంతా ఓటు వేయడంపై జనానికి అవగాహన కల్పించాలి అంటూ ట్వీట్ చేశారు.  దానికి నాగార్జున  సమాధానం చెబుతూ మీ మంచి మాటలకు కృతజ్ఞతలు.  ప్రజాస్వామ్యంపై మాకు నమ్మకముంది.  తప్పకుండా మేమంతా ఓటు హక్కును వినియోగించుకుంటాం అన్నారు.