నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత..

నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత..

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది... ఎగువ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో ఇన్‌ఫ్లో ఉండడంతో శ్రీశైలం డ్యామ్ దగ్గర 10 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండగా.. పెద్ద ఎత్తున కృష్ణానది నీరు నాగార్జున సాగర్‌కు చేరుతోంది... నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు గంట గంటకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల అవుతున్నందున లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు ఇప్పటికే దిగువ ప్రాంతాల ప్రజలను కోరారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు 9,48,343 ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 582 అడుగులకు చేరింది నీటిమట్టం.. గంటకు ఒక అడుగు చొప్పున సాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది అంటున్నారు అధికారులు. మొదట ఒక్క గేటును ఎత్తివేసిన అధికారులు.. ఆ తర్వాత మరో గేటు.. ఇలా ఇప్పటి వరకు నాలుగు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.