అలాంటి సీన్స్ తీసేయండన్న నాగార్జున

అలాంటి సీన్స్  తీసేయండన్న నాగార్జున

నాగార్జున ప్రస్తుతం 'మన్మథుడు 2' సినిమా చేస్తున్నారు.  సినిమాలో ఆయన చాలా యంగ్ అనిపిస్తున్నారు.  ఆ లుక్ చూసిన అభిమానులు, ప్రేక్షకులు 60 ఏళ్ళ వయసులో కూడా ఇంత ఛార్మింగ్ లుక్ ఏమిటని ఆశ్చర్యపోయారు.  అంతవరకూ బాగానే ఉన్నా.. విడుదలైన ట్రైలర్లో నాగ్ లిప్ లాక్ సీన్స్ చూసిన వారంతా కొంచెం శృతిమించినట్టున్నారని విమర్శలు చేశారు. 

తాజాగా విడుదలైన రకుల్ పాత్ర తాలూకు ట్రైలర్లో సైతం ఏ సర్టిఫికెట్ సినిమా చూపిస్తా అంటూ మెసేజ్ ఇచ్చారు.  దీంతో సినిమాలో హాట్ సీన్స్ మరీ ఎక్కువ ఉంటాయేమో.. కుటుంబంతో కలిసి చూడటం ఎలా అనే మాటలు వినబడ్డాయి.  దీంతో నాగ్ తనకు ప్రధాన బలమైన ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా పట్ల నెగెటివ్ భావనతో ఉండకూడదని చిత్రంలోని హాట్ సన్నివేశాలను కొంచెం తగ్గించమని దర్శకుడికి సూచించినట్టు సమాచారం.