సమంతను చూపించి ... కొడుకులకు నాగ్ క్లాస్..!!?

సమంతను చూపించి ... కొడుకులకు నాగ్ క్లాస్..!!?

చేసే పని ఏదైనా సరే పర్ఫెక్ట్ గా చేయాలి.  చేసిన పనికి న్యాయం చేయాలి.  ఫలానా సమయానికి ఫలానా చోటికి వెళ్ళాలి అంటే.. దానికంటే పది నిముషాలు ముందుగా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి.  అప్పుడే వర్క్ పర్ఫెక్ట్ గా అవుతుంది. సినిమా రంగంలో రాణించాలని అనుకునే వాళ్ళు కూడా సమయాన్ని ఫాలో అవుతుంటారు.  

ఈ విషయంలో నాగార్జున సమయాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతుంటాడు.  అందుకే నటుడిగా ఇప్పటికి సినీ రంగంలో నిలబడ్డాడు.  ఈ విషయంపై నాగార్జున తన కొడుకులకు క్లాస్ తీసుకున్నారట.  షూటింగ్ సమయానికి 20 లేదా 15 నిమిషాల ముందే సెట్స్ లో ఉండి ఆరోజు తీయబోయే సీన్ గురించి ఆలోచించాలని, సీన్ ప్రిపరేషన్ చర్చించుకునే సమయం దొరుకుంటుందని నాగ్ చైతుకు, అఖిల్ కు చెప్పినట్టు తెలుస్తోంది. 

ఇలా సమయాన్ని ఖచ్చితంగా ఫాలో అయితే..కెరీర్లో మంచి నటుడిగా ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పారట.  సమంత అలా చేయడం వలనే ఇప్పటికి సినీ రంగంలో రాణిస్తున్నట్టు నాగ్ చెప్పినట్టు సమాచారం.  నాగ్ చెప్పిన మాటలను ఇద్దరు కొడుకులు ఎంత వరకు సీరియస్ గా తీసుకుంటారో చూడాలి.