ఆర్కియాలజిస్ట్ గా నాగార్జున

ఆర్కియాలజిస్ట్ గా నాగార్జున

రణబీర్  కపూర్,అలియాభట్ జంటగా నటిస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. హిందీ దర్శకనిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫాంటసీ అంశాలతో తెరకెక్కుతుంది. ఇటీవల ఈ సినిమా కోసం షారుఖ్ ఖాన్ కూడా షూటింగ్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున ఆర్కియాలజిస్ట్ గా కనిపించనున్నారు. ఆయన తన పురావస్తు విద్యార్థులతో కలసి పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న దేవాలయాలను సందర్శించే యాత్ర చేపడుతారట. ఓ సంఘటన హీరో హీరోయిన్లు ఇద్దరూ నాగార్జున దగ్గరకు వచ్చేలా చేస్తుందని అంటున్నారు. కథలో నాగార్జున పాత్ర చాలా కీలకమని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.