మరోసారి 'మనం' కాంబినేషన్

మరోసారి 'మనం' కాంబినేషన్

అక్కినేని కుటుంబం మర్చిపోలేని చిత్రం 'మనం'.  ఇందులో అక్కినేని మూడు తరాల హీరోలు నటించారు.  పైగా నాగేశ్వరరావుగారికి ఇదే ఆఖరి సినిమా.  విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.  అందుకే ఈ దర్శకుడితోనే ఇంకో శింజిమా ప్లాన్ చేస్తున్నాడు నాగ్.  ప్రస్తుతం 'మన్మథుడు 2' చిత్రీకరణలో బిజీగా ఉన్న ఆయన అది పూర్తికాగానే 'బంగార్రాజు' చేయునున్నారు.  ఈ సినిమా పూర్తయ్యేలోపు విక్రమ్ కుమార్ నానితో చేస్తున్న 'గ్యాంగ్ లీడర్' ముగిస్తాడు.  ఒకేసారి ఇద్దరూ ఫ్రీ అయ్యాక కలిసి కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నారు.