బిగ్ బాస్ ను వదిలేసి అడవుల్లో తిరుగుతున్న నాగ్

బిగ్ బాస్ ను వదిలేసి అడవుల్లో తిరుగుతున్న నాగ్

సినిమా షూటింగ్స్ కు అనుమతులు ఇవ్వగానే టాలీవుడ్ లో ముందుకు వచ్చిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నాగార్జుననే. ఓ వైపు బిగ్ బాస్ రియాలిటీ షోను మొదలు పెట్టి మరో వైపు తన సినిమాను కూడా పట్టాలెక్కించాడు. ప్రస్తుతం ఈ రెండు షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నాడు నాగ్. ప్రస్తుతం అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం లో వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈ పాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది . ఆ తర్వాత  కరోనా ఎంట్రీ ఇవ్వడంతో మరింత లేట్ అయింది . ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని ఇటీవలే తిరిగి ప్రారంభించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నాగ్ తన టీమ్ తో అడవుల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'వైల్డ్ డాగ్'' షూటింగ్ ప్రస్తుతం హిమాలయాల పర్వతాల్లో జరుగుతున్నట్లు ఇటీవల నాగార్జున వెల్లడించారు. దియా మీర్జా - సయామి ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.