'మన్మథుడు-2' మొదలయ్యేది ఎప్పుడంటే !

'మన్మథుడు-2' మొదలయ్యేది ఎప్పుడంటే !

నాగార్జున కెరీర్లోని భారీ హిట్లలో 'మన్మథుడు' కూడ ఒకటి.  ఈ సినిమా తర్వాతే నాగార్జునకు టాలీవుడు మన్మథుడు అనే ట్యాగ్ సుస్థిరమైంది.  ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది. దీన్నీ రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయనున్నాడట.  ఇటీవలే 'చి.ల.సౌ' సినిమాతో దర్శకుడిగా జర్నీ  మొదలుపెట్టాడు రవీంద్రన్. 

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా నవంబర్ నుండి మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.  ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మించనున్నారు.  ఈ చిత్రం కూడ మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ గానే ఉంటుందట.