'అలీకి ఆసక్తి ఉంది.. కానీ మేమే చేర్చుకోలేదు'

'అలీకి ఆసక్తి ఉంది.. కానీ మేమే చేర్చుకోలేదు'

సినీనటుడు అలీని తాము తిరస్కరించాకే వైసీపీలో చేరారని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా చెప్పారు. అలీని పోటీకి దింపితే ఓటమి తప్పదని తమ సర్వేలో తేలిందన్నారాయన. 2019 ఎన్నికల్లో ఒక్క ముస్లిం, ఒక్క మైనార్టీ ఓటు కూడా వైసీపీకి రాదన్న నాగుల్‌ మీరా.. టీడీపీతో గుర్తింపు పొందిన కొందరు నేతలు పార్టీలు మారుతూ సందుల్లో పందుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.