పోలీసు కస్టడికి సైకో శ్రీనివాసరెడ్డి

పోలీసు కస్టడికి సైకో శ్రీనివాసరెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ లో వరుస హత్యలకు పాల్పడ్డ సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని పోలీసు కస్టడికి కోర్టు అనుమతి ఇచ్చింది. శ్రీనివాస్ రెడ్డిని రేపటి నుండి ఈ నెల 13 వరకు 6 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న శ్రీనివాస్ రెడ్డినియాదాద్రి పోలీసులు రేపు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. శ్రీనివాస్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నల్లగొండ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.