కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తా: నామా

కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తా: నామా

'తెలంగాణ బిడ్డగా, రైతు బిడ్డగా, స్థానికుడిగా మీ పక్షాన పని చేస్తా. నాకు ఓటు వేసి గెలిపించండి' అని కోరారు ఖమ్మం లోక్‌సభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. ఇవాళ పాల్వంచలో ఆయన మాట్లాడుతూ పాల్వంచ, కొత్తగూడెంలలో తాను చదువుకున్నానని.. ఇక్కడే కూలిపని చేసి వ్యాపారవేత్తగా ఎదిగానని చెప్పారు. తనను గెలిపిస్తే కొత్తగూడెం ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనును పూర్తి చేస్తానని చెప్పారు. తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికై తెలంగాణకు తొలి ఓటు వేశానన్న నామా.. ఖమ్మం సీటును గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు.