ఈ డిగ్రీల కోర్సుల పేర్లు మారుతున్నాయ్..!

ఈ డిగ్రీల కోర్సుల పేర్లు మారుతున్నాయ్..!

తెలంగాణలో డిగ్రీ కోర్సుల పేర్లు మారుతున్నాయి. బీఎస్సీ లైఫ్‌సైన్స్‌లో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీని తొలిగించి బీఎస్సీ ఫిజికల్ సైన్స్ కోర్సుగా మార్పు చేసి.. బీఎస్సీ లైఫ్‌సైన్స్ కోర్సు పరిధిలోకి బోటనీ, జువాలజీ, మైక్రో టెక్నాలజీ, మైక్రోబయాలజీ కోర్సులను తీసుకొచ్చారు. అంటే.. ఎంపీసీ గ్రూపునకు సంబంధించిన మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌, జియాలజీతో పాటు ఇతర సబ్జెక్టులు బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌లో ఉంటాయి. బీజడ్‌సీకి సంబంధించిన బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మైక్రో బయోలజీ వంటి సబ్జెక్టులు బీఎస్సీ లైఫ్‌ సైన్స్‌లోకి వస్తాయి. ఇక.. బీఏలోని కోర్సులను సీబీసీఎస్ కోర్సులుగా మార్చారు. చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టంను పక్కాగా అమలు చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కళాశాల విద్యాశాఖ పేర్కొంది. ఈ విధానాన్ని తొలుత ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో, తర్వాత ప్రైవేటు కాలేజీల్లో అమలు చేయాలని భావిస్తున్నారు.