నేమ్‌ ప్లేట్‌: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం..!

నేమ్‌ ప్లేట్‌: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం..!

హోరా హోరీ ప్రచారం ముగిసింది.. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు, మరికొన్ని చోట్ల ప్రశాంత వాతావరణం, కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంల మొరాయింపు, కొన్ని గ్రామాల్లో ఫైటింగ్‌లు.. ఇలా మొత్తానికి పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. అయితే, ఫలితాలు తెలియాలంటే మాత్రం మే 23వ తేదీ వరకు వేచిఉండాల్సిందే. మరోవైపు గెలుపుపై అటు తెలుగుదేశం పార్టీ నేతల్లోనూ ధీమా కనిపిస్తోంది. తిరిగి అధికారంలోకి వస్తామంటున్నారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయిపోయారు. ఇక ప్రమాణస్వీకారం చేయడమే మిగిలింది అనే నమ్మకంతో ఉన్నారు. వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ కూడా.. జగనే సీఎం.. ఏపీకి బెస్ట్ సీఎంగా పనిచేయాలంటూ అభినందనలు తెలిపారు. ఇదంతా ఒకవైపు.. మరోవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం ఆ పార్టీ నేతలు ఏకంగా సీఎం నేమ్ ప్లేట్ సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి’ అంటూ తెలుగు, ఇంగ్లీష్‌లో రాసిన నేమ్ బోర్డు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది.