బాలయ్య 105వ సినిమా టైటిల్ ఇదే..

బాలయ్య 105వ సినిమా టైటిల్ ఇదే..

నందమూరి బాలకృష్ణ అనగానే పవర్‌పుల్ డైలాగ్స్, అదిరిపోయే యాక్షన్ సీన్స్ గుర్తుకొస్తాయి.. ఇక మేకర్స్ కూడా బాలయ్యను దృష్టిలో పెట్టుకుని సినిమాకు పవర్‌పుల టైటిల్ పెట్టేస్తుంటారు.. ఇప్పుడు.. బాలయ్య, దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 105వ సినిమా కూడా అదిరిపోయే టైటిల్ పిక్స్ చేశారు. ఈ సినిమా కోసం ఇప్పటికే తన గెటప్ మార్చేశారు బాలయ్య... ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా.. గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. అసలు ఓ పోలీసు ఆఫీసర్.. గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమా స్టోరీగా తెలుస్తోంది.

ఇక బాలయ్య 105వ సినిమా టైటిల్ విషయానికి వస్తే.. ముందుగా ఈ సినిమాకు ‘క్రాంతి’, ‘జడ్జిమెంట్’, ‘డిపార్ట్‌మెంట్’ లాంటి పేర్లను కూడా పరిశీలించారట... చివరకు ఈ సినిమాలో బాలయ్య పాత్రను దృష్టిలో ఉంచుకొని.. ఆయన ఇమేజ్‌కు తగ్గట్టుగా ‘రూలర్’ టైటిల్ పెట్టేశారు. ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమిని టీవీ సొంతం చేసుకుంది.. భారీ ధర పలికినట్టు తెలుస్తోంది. అయితే.. సోషల్ మీడియాలో వెల్లడించింది జెమిని టీవీ.. బాలకృష్ణ, సోనాల్ చౌహాన్ నటించిన "రూలర్" శాటిలైట్ రైట్స్‌ను తాము సొంతం చేసుకున్నామని ప్రకటించింది. ఇక, త్వరలోనే తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుండగా.. ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 20వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.