మా అన్నను చూస్తే నాన్నను చూసినట్టే ఉండేది - బాలకృష్ణ

మా అన్నను చూస్తే నాన్నను చూసినట్టే ఉండేది - బాలకృష్ణ

హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.  అన్న మరణంతో తీవ్ర వేదనకు గురైన ఆయన సోదరుడు నందమూరి బాలకృష్ణ ఉదయం నుండి అన్ని కార్యక్రమాల్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. 

కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడిన ఆయన హరికృష్ణగారు ఒక నటుడిగా, నాయకుడిగా పార్టీలకు అతీతంగా అందరితోనూ కలుపుగోలుతనంగా ఉండేవారని, ఆయనది గొప్ప వ్యక్తిత్వమని, ఎన్ని పనులున్నా కుటుంబం కోసం సమయం కేటాయించేవారిని,  కుటుంబ కార్యక్రమాలకి వచ్చినప్పుడు ఆయన హుందాతనం చూస్తే నాన్నను చూసినట్టే ఉండేదని, ఆయన మన మధ్యన లేకపోవడం కుటుంబానికి, పార్టీకి, అభిమానులకు తీరని లోటని భాధను వ్యక్తం చేశారు.